మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ ఆగస్టు 21న ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. పూజను ఎందుకు కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలని ఢిల్లీ పోలీసులతో పాటు యూపీఎస్సీ కి నోటీసులు జారీ చేసింది. కాగా ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ (UPSC).. ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది.