ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. హస్తినలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని సూచించారు. కాలుష్య అంశం చేయి దాటి పోయిందని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. జీఆ ర్ పీఏ 4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని న్యాయస్థానాలు పూర్తిగా వర్చువల్ వి ధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవా దులు కపిల్ సిబల్, గోపాల్ శంకర నారాయణ న్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రిక్వెస్ట్ చేశారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చు వల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపిం చవచ్చని సీజేఐ తెలిపారు.