Delhi : ఢిల్లీని కమ్మిన కాలుష్యపు పొగ

Update: 2024-11-01 11:15 GMT

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. బాణసంచాపై నిషేధం ఉన్నప్పటికీ దాన్ని కొంతమంది పట్టించుకోలేదు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి పలు చోట్ల ప్రజలు టపాసులు పేల్చారు. దీంతో తీవ్రమైన శబ్దకాలుష్యంతోపాటు గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. ఉదయం తెల్లవారుజామున దట్టమైన పొగ అలముకుంది. ఎదురుగా వాహనాలు కన్పించలేనంత పొగ ఆవరించింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ AQI 395 పాయింట్లకు చేరుకుంది. అశోక్‌ విహార్‌, మందిర్‌ మార్గ్‌, ఎయిర్‌పోర్టు, బురారీ, ఆర్కే పురం, జహంగీర్‌పుర్‌లో 350 పైనే గాలి నాణ్యతను ఇండెక్స్ చూపెట్టింది. గజియాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడాలోనూ అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత క్రమంగా తగ్గుతోంది. ఇంకొద్దిరోజుల్లో అంతా సెట్ అవుతుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News