Yamuna river: ఉప్పొంగిన యమున..

45 ఏళ్ల తర్వాత యమునా నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది.

Update: 2023-07-13 03:00 GMT

ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది.ఎగువన ఉన్న హరియాణా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. మధ్యాహ్ననికి యుమునా నది నీటిమట్టం 207.55 మీటర్లకు పెరిగింది. దీంతో ఢిల్లీ సర్కార్‌ అలర్ట్‌ అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించించారు. నది పరివాహక ప్రాంతంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని హెచ్చరించారు.

45 ఏళ్ల తర్వాత యమునా నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. దీంతో ఏ క్షణాన వరదలు సంభవిస్తాయేమోనని ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. హరియాణా నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఢిల్లీలో యుమనా నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా.. రెండు రోజుల క్రితమే డేంజర్‌ మార్క్‌ను దాటింది. 2013 తర్వాత నది ప్రమాద స్థాయిలో ప్రవహిచడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇప్పటికే తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించారు. కాలనీలను వరద ముంచెత్తడంతో జనం తీవ్ర తీవ్ర అవస్థలు పడుతున్నారు.

యమునా ప్రవాహం డేంబర్‌ బెల్స్‌ మోగిస్తుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉన్నతాధికారులతో సీఎం కేజ్రీవాల్‌ అత్యవసంగా సమావేశమయ్యారు. నదిలో నీటిమట్టం స్థాయి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ కోరారు. కేంద్ర జలసంఘం అంచనా వేస్తున్నట్టు నీటి మట్టం మరింత పెరిగితే ఢిల్లీ నగరానికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు లేకపోయినా యుమునా ప్రవాహం ఉధృతంగా ఉందన్నారు. హరియాణాలోని హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే దీనికి కారణమని పేర్కొన్నారు.

Tags:    

Similar News