Delhi: ఢిల్లీని కప్పేసిన పొగమంచు
నిన్నటి వరకు కాలుష్యం.. నేడు పొగమంచు..;
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలను దట్టమైన పొగ మంచు కమ్మేసింది.
దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. 50 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. ఢిల్లీ పాలెం విమానాశ్రయం సమీపంలో విజిబిలిటీ 50 మీటర్లుగా నమోదైంది. సఫ్ధార్‌జంగ్ అబ్జర్వేటరీలో 200 మీటర్లుగా ఉంది. విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పలు విమాన, రైళ్ల రాకపోలకకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 30 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని 14 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇక పంజాబ్‌లోని లూథియానా, పాటియాలా, అమృత్‌సర్‌లోపాటు హర్యానాలోని అంబాలా, హిస్సార్, కర్నాల్‌లో విజిబిలిటీ 25 మీటర్లుగా నమోదైంది. అదేవిధంగా రోహ్‌తక్‌లో 200 మీటర్లు, ఉత్తరప్రదేశ్ వారణాసిలో 25 మీటర్లు, లక్నోలో 50, బరేలీలో 200, రూర్కెలాలో 50, త్రిపుర అగర్తలాలో 200 మీటర్ల మేర విజిబిలిటీ నమోదైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, కాన్పూర్‌లో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది.
ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో ఉదయం 5:15 గంటల సమయంలో పొగమంచు వేగంగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఒక ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌తో సహా వాయువ్య భారతదేశం, దానికి అనుకుని ఉన్న మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో దృశ్యమానత 50 మీటర్లకు, పాలంలో 125 మీటర్లకు పడిపోయింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో దృశ్యమానత సున్నాకు పడిపోయింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని బరేలి, లక్నో, ప్రయాగ్‌రాజ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో దృశ్యమానత 25 మీటర్లకు, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 50 మీటర్లకు పడిపోయింది.