Kumbh Mela : కుంభమేళాలో డిజిటల్ బాబా..పెళ్లి కోసం ఏం చెప్పారంటే?

Update: 2025-01-16 15:45 GMT

ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జన్మించిన స్వామి రామ్ శంకర్ మహారాజ్ డిజిటల్ బాబాగా ప్రసిద్ధి చందారు. 2008లో మహంత్ స్వామి శి వచరణ దాస్ మహారాజ్ చేత ఆదిత్యలోమా శ్ రుషి ఆశ్రమంలో చేరారు. 2017 నుండి హిమాచల్ ప్రదేశ్లోని బైజ్ నాథ్ ధామ్లో నివసిస్తూ, వేదాంతం, ఉపనిషత్తులపై సోషల్ మీడియా వేదికగా ఆధ్యాత్మిక ప్రసం గాలు చేస్తున్నారు. ఈ నెల 13న ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఈ డిజిటల్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఆధ్యా త్మికతను ఆధునిక సాంకేతికతతో కలిపి వివరిస్తున్నారు. సాధారణంగా ఉండే బాబా లలాగా కాకుండా ఆయన వెరైటీగా చేతిలో ఆపిల్ ఐ ఫోన్ 16 మ్యాక్స్ ప్రో, ఆపిల్ 2024 మ్యాక్ బుక్ ప్రో ఎం4 మ్యాక్స్, ట్రై పాడ్,రోడ్ వైర్లెస్ మైక్రోఫోన్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయనకు 336కే ఫేస్బుక్ ఫాలోవర్లు, 29.6కే యూట్యూబ్ సబ్స్కబర్లు ఉన్నారు. తన ఆధ్యాత్మిక సం దేశాలను పాఠశాలలో కూర్చొని ప్రసంగించడం కాకుండా, డిజిటల్ యుగానికి తగినట్లుగా ఆధ్యాత్మికతను ప్రజలకు బోధి స్తుంటారు. “సోషల్ మీడియా, యువతతో కనెక్ట్ కావడానికి కొత్త మార్గం అని నేను గుర్తించాను. అందుకే నేను డిజిటల్ బాబా అయిపోయాను” అని స్వామి రామ్ శంకర్ వివరించారు.

Tags:    

Similar News