భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.
తమ రాష్ట్రంలో అన్ని మతాలవారూ సేఫ్‌గానే ఉన్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అన్నారు. ‘హిందువులు సురక్షితంగా ఉంటే ముస్లింలూ సురక్షితంగానే ఉంటారు. 100 హిందూ కుటుంబాల మధ్యలో ఓ ముస్లిం కుటుంబం అత్యంత సురక్షితంగా ఉండగలదు. 100 ముస్లిం కుటుంబాల మధ్య 50మంది హిందువులు సేఫ్‌గా ఉండగలరా? బంగ్లా, పాక్ దేశాలే నిదర్శనం. అఫ్గాన్‌లో హిందువులు ఏమయ్యారు? అక్కడ జరిగిన తప్పు మన వద్ద జరగకూడదు’ అని స్పష్టం చేశారు.