ప్రస్తుతం సింధ్‌లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగుచేస్తుండగా...ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్‌లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్థాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే...సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్‌లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఇక రాజకీయంగా చూసినా పంజాబ్ ప్రావిన్స్ శక్తిమంతమైంది. ప్రస్తుత ఆర్మీచీఫ్ మునీర్‌ది ఈ రాష్ట్రమే. ఇక షరీఫ్‌ల కుటుంబం అడ్డా కూడా ఇదే. మరోవైపు భుట్టోల కుటుంబానికి సింధ్‌లో బలమైన పట్టు ఉంది.