జమ్మూకశ్మీర్ లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. సైనిక బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యమా అంటూ పిటిషనర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ పాత్రపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్ఞలు దాఖలు చేసే ముందు బాధ్యతగా ఉండాలని పిటిషనర్ కు న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ సూచించారు. ఇతర రా ష్టాల్లో చదువుతున్న కశ్మీరీ విద్యా ర్థులపై ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది.