చండీగఢ్‌లోనూ తెల్లవారుజామున దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌లో ఉదయం 5 గంటలకు భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు తెలిపారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడగా.. భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. పాక్ డ్రోన్ దాడుల్లో పలువురు గాయపడ్డారు. ఇటీవల రాజౌరిని లక్ష్యంగా చేసుకొని పాక్ జరిపిన దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా మృతి చెందిన విషయం తెలిసిందే.