Dussehra Celebrations : కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు.. రావణ దహన కార్యక్రమాలు..

Dussehra Celebrations : లడఖ్‌లోనూ దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. లేహ్‌లోని పోలో గ్రౌండ్‌లో రావణ దహన కార్యక్రమం జరిగింది;

Update: 2022-10-05 15:00 GMT

Dussehra Celebrations : లడఖ్‌లోనూ దసరా ఉత్సాలు అంబరాన్నంటాయి. లేహ్‌లోని పోలో గ్రౌండ్‌లో రావణ దహన కార్యక్రమం జరిగింది. రావణ దహనంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పంజాబ్‌లోనూ దసరా ఉత్సాలు ఘనంగా జరిగాయి. లూధియానాలో రహణ దహనం జరిగింది. దరేసి గ్రౌండ్‌లో జరిగిన రావణ దహన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌లో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు. డెహ్రాడున్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు.బీహార్‌లోని పాట్నాలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. స్థానిక గాంధీ మైదానంలో రావణ దహనం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News