Delhi CM : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టిన కేజ్రీవాల్‌

Update: 2024-02-19 06:40 GMT

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులను లెక్క చేయలేదు. విచారణకు రావాలని ఆరోసారీ ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపగా.. ఆయన డుమ్మా కొట్టారు. ఈడీ ఇచ్చిన సమన్ల ప్రకారం.. సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం సమాచారమిచ్చారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణకు నోటీసులివ్వడం చట్టవిరుద్ధమని,అది పూర్తి అయ్యే వరకు రాలేనని తెలిపారు. శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు వర్చువల్ గా హాజరైన కేజ్రీవాల్ మార్చి 1 వ తేదీ తరువాత వ్యక్తిగతంగా హాజరు అవుతానని తెలిపారు. దీంతో కోర్టు మార్చి 16 వరకు ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

కాగా,లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులోనూ సమన్లు అందాయి. ఇక, ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ జైల్లో ఉన్నారు.

Tags:    

Similar News