Gangster Inderjit Yadav: గ్యాంగ్ స్టార్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు- సూట్‌కేసుల నిండా బంగారం, వజ్రాభరణాలే
ఏకంగా రూ.14 కోట్లు స్వాధీనం
మనీలాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీలోని ఓ నివాసంలో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో సుమారు రూ.5 కోట్ల నగదు, రూ.8 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, అలాగే రూ.35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక సూట్‌కేసులోనే రూ.8.80 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను గుర్తించారు. ఈ సోదాలు మంగళవారం మొదలై బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అక్రమంగా సంపాదించిన డబ్బును లెక్కించడానికి బ్యాంక్ అధికారులను, కరెన్సీ నోట్లను లెక్కించే యంత్రాన్ని కూడా పిలిపించారు. రాజకీయ అండతో ఇందర్జీత్ సింగ్ యాదవ్ బెదిరించి డబ్బులు వసూలు చేశాడని, ఈ డబ్బుతోనే అక్రమాలకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతను యూఏఈకి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
హరియాణాకు చెందిన ఇందర్జీత్ సింగ్ యాదవ్ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 30న దిల్లీలోని సర్వప్రియా విహార్‌లో ఉన్న ఇందర్‌జిత్ సన్నిహితుడి నివాసంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది. భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు గుర్తించింది. హర్యానాకు చెందిన ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పలు మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడు. యూఏఈ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
ఢిల్లీలోని అతని సన్నిహితుడు అమన్ కుమార్ నివాసంలో సోదాలు నిర్వహించగా, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఇంద్రజిత్ దోపిడీ, ఫైనాన్షియర్ల కోసం సెటిల్‌మెంట్లు, బెదిరింపు చర్యలకు సంబంధించి హర్యానా, ఉత్తర ప్రదేశ్ పోలీసులు అతనిపై 14కు పైగా ఎఫ్ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేశారని తెలిపారు. ఈడీ దాడుల్లో బయటపడిన ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉండటంతో, ఈ కేసు మరింత తీవ్రంగా మారింది. యాదవ్ అక్రమ సంపాదన వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఈడీ అధికారులు బయటపెట్టే పనిలో ఉన్నారు.