త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పోటీపడుతున్నాయి. రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ జరుగుతోంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్‌ను ఆప్ విడుదల చేసింది. అందుకు దీటుగా బీజేపీ అవినీతిపై 'రప్పా రప్పా' పేరుతో పోస్టర్లు రిలీజ్ చేసింది.