Elvish Yadav Drug Case : ఎల్విష్ యాదవ్ రేవ్ పార్టీ కేసు: సాంపిల్స్ లో కోబ్రా విషం గుర్తింపు

Update: 2024-02-16 07:11 GMT

నవంబర్ 2023లో నోయిడాలో (Noida) జరిగిన రేవ్ పార్టీలో (Rev Party) స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో పాము విషం ఉన్నట్లు జైపూర్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) తన ఇటీవలి నివేదికలో పేర్కొంది. దీంతో ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విజేత న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. ఎల్విష్ పార్టీలో పాము విషం సరఫరా, వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపించారు. ఎల్విష్‌పై గతేడాది ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది.

అనేక మీడియా నివేదికల ప్రకారం, సాంపిల్స్ లో కోబ్రా, క్రైట్ పాముల విషం ఉందని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక పేర్కొంది. రేవ్ పార్టీని ఛేదించిన తర్వాత, వేదిక నుంచి సేకరించిన నమూనాలను నోయిడా పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉండే యూట్యూబర్ ఈ నివేదికలపై ఇంకా స్పందించలేదు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఆయన పదే పదే ఖండిస్తూ వస్తున్నాడు.

భారతీయ జనతా పార్టీ ఎంపీ మేనకా గాంధీతో సంబంధం ఉన్న పీపుల్ ఫర్ యానిమల్స్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి అందిన సమాచారం ఆధారంగా నోయిడా పోలీసులు నవంబర్ 3న ఆపరేషన్ నిర్వహించి పాము విషం విక్రయ రాకెట్‌లో పాల్గొన్న ఐదుగురిని అరెస్టు చేశారు. ఎల్విష్ పేరు బయటకు వచ్చిన తర్వాత, ఈ రాకెట్‌లో తనకు ఎలాంటి పాత్ర లేదని, మేనకా గాంధీ చేత తప్పుగా ఇరికించబడ్డారని పేర్కొన్నాడు.

Tags:    

Similar News