MODI: ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటికాలం
ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటికాలం అని ప్రధాని మోదీ అన్నారు. ఆ గడ్డుకాలాన్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు.;
ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటికాలం అని ప్రధాని మోదీ అన్నారు. ఆ గడ్డుకాలాన్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు. ప్రజాస్వామ్యవాదులను అప్పట్లో తీవ్రంగా హింసించారని చెప్పారు. మన్ కీ బాత్‌లో భాగంగా మోదీ పలు అంశాలపై మాట్లాడారు. వాస్తవానికి ప్రతినెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ ఉంటుంది. అయితే వచ్చేవారం ప్రధాని అమెరికా పర్యటనలో ఉండనున్న నేపథ్యంలో ఈసారి ఒకవారం ముందుగానే దాన్ని ప్రసారం చేశారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అని మోదీ అన్నారు. అందువల్ల 1975లో ఎమెర్సిన్సీని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. లక్షల మంది ప్రజలు ఎమర్జెన్సీని తీవ్రంగా ప్రతిఘటించారని చెప్పారు.