ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రూ.12 లక్షల వరకూ జీరో ట్యాక్స్ ఉంటుందని చెప్పడంతో చిరు, మధ్యతరహా ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో 75శాతం కంటే ఎక్కువ మంది రూ.12 లక్షల కంటే తక్కువ జీతాలు పొందేవారే ఉన్నారని, ఇది ఉపశమనం కలిగించే విషయం అని కొనియాడుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
వరికి ఎంత డబ్బు ఆదా అవుతుందంటే..
కొత్త పన్ను విధానంలో ప్రస్తుత శ్లాబుల ప్రకారం ₹8లక్షల ఆదాయముంటే ₹30, ₹9లక్షలకు ₹40, ₹10లక్షలకు ₹50, ₹11లక్షలకు ₹65, ₹12లక్షల కు ₹80 పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు రిబేటుతో కలిపి ₹12.75లక్షల వరకు పన్ను లేదు కాబట్టి ఆ మేరకు లబ్ధి కలిగినట్టే. గతంతో పోలిస్తే ఇక నుంచి ₹16లక్షల కు ₹50, ₹20లక్షలకు ₹90, ₹24లక్షలకు ₹1.10, ₹50లక్షలకు ₹1.10L మేర ట్యాక్స్ బెనిఫిట్ కల్పించారు. అంటే వీరికి సగటున ఏటా 30% డబ్బు ఆదా అవుతున్నట్టే.