జమ్మూకశ్మీర్ దోడాలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు వీరమరణం పొందినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్ పరిసరాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నలుగురు ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ ఉదమ్‌పూర్‌లో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం గాలింపు చేపట్టిన భద్రతా దళాలపై తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో సాయుధులు దోడా జిల్లాలోని అడవుల్లోకి పారిపోయారు. దీంతో నిన్న రాత్రి నుంచి కార్డన్ సెర్చ్ చేపట్టారు.