Encounter : మల్కన్ గిరిలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

Update: 2024-11-22 09:15 GMT

ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లాలో ఎనౌకౌంటర్ జరిగింది. ఒడిశా నుంచి ఛత్తీస్ గఢ్ లోకి మావోయిస్టుల చొరబాట్ల గురించి భద్రతా బలగాలకు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కలిమెల బ్లాక్ లోని జినెల్గూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయు. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. డీవీఎఫ్ జవాన్ దమ్రుబాద్ నాయక్ గాయపడ్డారు. మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

Tags:    

Similar News