ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) నుంచి నగదు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. బ్యాంక్ ఖాతాల నుంచి ఈపీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా నగదు ఉపసంహ రించుకునే సదుపాయం కల్పించనున్నారు. ప్రస్తుతం పీఎఫ్ నగదును విత్ డ్రా చేయాలంటే చాలా సమయం పడుతుంది. తిరస్కరణకు కూడా గురవుతుంటాయి. ఈ నేపధ్యంలోనే నగదు విత్ డ్రాను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకు వస్తోంది. ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల ప్రకటించారు. జూన్ నాటికి ఈ సదుపాయం అందుబా టులోకి వస్తుంది. ఏటీఎంతో పాటు యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ ను ఉపసంహరించుకునేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ (ఎన్ పీసీఐ) తో ఈపీఎఫ్ ఓ చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరం మే, జూన్ నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.