ఉద్యోగ భవిష్య నిధి ఆన్ లైన్ లో నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్లైన్లో డబ్బును విత్ డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చేసిన చెక్కును అప్లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది. దీంతో పాటు బ్యాంక్ ఖాతాను యజమానులు ధుృవీకరించాల్సిన అవసరంలేదని తెలిపింది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియతో సుమారు 8 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధులు ఉపసంహరణ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయాలంటే యూఏఎస్ లేదా పీఎఫ్ నంబర్ లింక్ చేసిన బ్యాంక్ పాస్బక్కు సంబంధించిన చెక్కు ఫోటోను అప్లోడ్ చేయాల్సిఇన ఉండేది. తరువాత దరఖాస్తుదా రుని బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా యజమానులు ఆమోదిం చాల్సి ఉంటుంది. అంటే ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తరువాతే నగదు వచ్చేది. ఈ అవసరాన్ని ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రటకలో తెలిపింది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తరస్కరణలను తగ్గించేందుకు ఈ చర్యలు సాయపడతాయని తెలిపింది.