vijay: తమిళ స్టార్ నటుడు విజయ్‌కి ఫత్వా జారీ

విజయ్ కి పత్వా జారీచేసిన ఆల్ ఇండియా ముస్లిం బోర్డు;

Update: 2025-04-18 06:00 GMT

మిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్‌కి యూపీలోని ఆల్ ఇండియా ముస్లిం బోర్డు షాక్ ఇచ్చింది. యూపీలోని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఫత్వా జారీ చేసింది. ఇందులో రంజాన్ మాసంలో విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇఫ్తార్ విందుకు రౌడీలను, ముస్లిమేతరులు పిలిచారని ఆరోపించారు. ముస్లిం సమాజం విజయ్‌ను నమ్మొద్దని.. విజయ్ నటించిన కొన్ని సినిమాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని ఆరోపించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన ఆహ్వానించిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే విజయ్‌ని కూడా మతపరమైన సమావేశాలకు ఆహ్వానించవద్దని ముస్లింలకు స్పష్టం చేసింది.

ముస్లిం సెంటిమెంట్ వాడేసుకుంటున్నాడా.. ?

ముస్లిం సెంటిమెంట్‌ను విజయ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాడని, మద్యం సేవించే, జూదం ఆడే వ్యక్తులను ఇఫ్తార్ సమావేశానికి ఆహ్వానించడం పాపమని, విజయ్ అదే చేశారని పేర్కొంది. అలాగే బీస్ట్ మూవీలో ముస్లింలను ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించారని పేర్కొంది. అందుకే ఫత్వా జారీ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. దీనిపై విజయ్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలకు విజయ్ అభిమానులు భారీగా తరలి వస్తారని ఇది సాధారమ విషయమని అన్నారు.

విజయ్​పై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు

రజ్వీ ఫత్వా జారీ చేయడాన్ని ఖండిస్తూ తమిళనాడు ముస్లిం లీగ్ నాయకుడు ముస్తఫా స్పందించారు. 'రంజాన్​ మాసంలో విజయ్ ఇఫ్తార్ విందు కోసం విజయ్ రోజంతా ఉపవాసం ఉన్నారని... అయితే కొన్ని రాజకీయ పార్టీల ప్రోత్సహంతో రజ్వీ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీవీకేను ఓడించలేమని అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది' అని ముస్తఫా అన్నారు. 2026లో అన్నాడీఎంకే -బీజేపీ ఒకవైపు, డీఎంకే - కాంగ్రెస్ జతకట్టగా ఒంటరిగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తోంది. ముస్లి పత్వాను కొందరు ఖండిస్తున్నారు.

Tags:    

Similar News