Fire Accident : థానేలోని కేఫ్‌లో అగ్ని ప్రమాదం

Update: 2025-08-14 11:30 GMT

ముంబైకి సమీపంలోని థానేలో గల ఒక కేఫ్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.థానేలోని ఖరేగావ్, కల్వా (పశ్చిమ)లో ఉన్న ఆరు అంతస్తుల నివాస భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న 'పర్శిక్ కేఫ్'లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదం కారణంగా కేఫ్‌లో ఉన్న టేబుళ్లు, కుర్చీలు, రిఫ్రిజిరేటర్లు, వంట సామాగ్రి వంటివి కాలిపోయి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో నివసిస్తున్న 35 మందిని అగ్నిమాపక సిబ్బంది, థానే మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ సిబ్బంది కలిసి సురక్షితంగా బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 6:25 గంటలకల్లా మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News