Srinagar: శ్రీనగర్ లోని దాల్ లేక్ లో అగ్ని ప్రమాదం

పలు లగ్జరీ హౌస్‌బోట్లు దగ్ధం

Update: 2023-11-12 00:15 GMT

ప్రముఖ పర్యాటక కేంద్రం శ్రీనగర్ దాల్ సరస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో పలు హౌస్ బోట్లు ధగ్థమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాల్ సరస్సులోని ఘాట్ నంబర్ 9 సమీపంలో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదు హౌస్ బోట్లు దగ్థమయ్యాయి అని ఓ అధికారి తెలిపారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణంపై వివరాలు తెలుసుకునే యత్నాలు జరుగుతున్నాయి. కాగా..సరస్సులో ‘లండన్ హౌస్, సపేనా, లల్లా రుఖ్ అనే పేర్లు గల హౌస్ బోట్లు దగ్థమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీనగర్ లోని దాల్ లేక్, నిజీన్ సరస్సుల నీటిపై తేలియాడే ప్యాలెస్ లుగా పేరొందని ఈ హౌస్ బోట్లు సంపన్నులు ఎక్కువగా విడిది చేస్తుంటారు. హనీమూన్ లకు ఇటవంటి లగ్జరీ బోట్లను వినియోగిస్తుంటారు. మొత్తం ఐదు నుంచి 8 హౌస్ బోట్లు దగ్థమయ్యాని..రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యాటకులకు ఎటువంటి ప్రమాదం జరగలేని అగ్నిమాపక అధికారి  తెలిపారు. భారీగా ఎగసిపడ్డ మంటలు పలు ఇతర బోట్లకు కూడా అంటుకున్నాయని స్థానికులు చెప్పారు. వెంటనే స్పందించి మంటలు ఆర్పామని, అయితే ఐదు బోట్లు మాత్రం పూర్తిగా తగలబడి పోయాయని వివరించారు. 

Tags:    

Similar News