Fire In Temple: ఉజ్జయినిలోని మహాకాళ్ ఆలయంలో అగ్నిప్రమాదం

13 మందికి గాయాలు

Update: 2024-03-25 05:00 GMT

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. హోలీ పండగ సందర్భంగా ఆలయంలో భస్మ హారతి  హారతి ఇచ్చే సమయంలో  గులాల్ ఊదడంతో గర్భగుడిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అర్చకులతో సహా 13 మంది తీవ్రంగా  గాయపడ్డారు.వీరందరిని  జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


వివరాల్లోకి వెళ్తే ..

మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలోహోలీ సందర్భంగా ఆలయంలోని గర్భగుడిలో 'భస్మ హారతి' ఇచ్చారు అర్చకులు. హారతి సందర్భంగా పూజారి సంజీవ్‌పై వెనుక నుంచి ఎవరో గులాల్   ఊదడంతో అది హారతిలో పడింది. రసాయనిక చర్య జరిగి ఒక్కసారి  తీవ్రంగా మంటలు వ్యాపించాయి. కాలిపోయిన వారిలో పూజారులు, సేవకులు ఉన్నారు. ఆలయంలో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు  పొలీసులకు సమాచారం ఇచ్చారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News