ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్ పీఎస్ఓ, CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా, మరో CRPF అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్‌ల పెళ్లి జరగనుంది. ఈ గౌరవప్రదమైన వేదికపై ఒక అధికారి వివాహాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. భవన్‌లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. వీరి పెళ్లికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఆమె.. 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. అనంతరం సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పోస్టింగ్ లభించింది. గణతంత్ర దినోత్సవ కవాతులో సీఆర్‌పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు.
ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పీఎస్ఓ హోదాలో అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పూనమ్ గుప్తాను చూడడం, ఆమెను సేవలు నచ్చడంతో పలుమార్లు ప్రశంసించడం జరిగింది. అయితే ఇటీవలే జరిగిన గణతంత్ర దినోత్స వేడుకల్లో జరిగిన పరేడ్‌లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తానే సారథ్యం వహించారు. ఇది చూసిన ద్రౌపది ముర్ము పూనమ్ గుప్తా పట్ల మరింత ఆకర్షితులయ్యారు.