Budget 2025: రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
మధ్యతరగతికి అదిరిపోయే శుభవార్త చెప్పిన నిర్మలా సీతారామన్;
ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం బడ్జెట్‌లో శుభవార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త అందించారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని మంత్రి నిర్మల్మ ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ శుభవార్త తెలిపారు. మధ్య తరగతికి ఊరట కలిగిస్తూ ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు పరిమితిని పెంచారు. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బల్లను చరుస్తూ అభినందనలు తెలిపారు.
కొత్త పన్ను శ్లాబుల సవరణ వివరాలు
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5%
రూ.8-12 లక్షలు - 10%
రూ.12-16 లక్షలు - 15%
రూ.16-20 లక్షలు - 20%
రూ.20-24 లక్షలు - 25%
రూ.24 లక్షల పైన 30%
వచ్చే వారం కొత్త ఆదాయపన్ను బిల్లు
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం సభలో కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. ఆదాయ పన్ను బిల్లులో ఎలాంటి ప్రకటనలు ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది. అలాగే బీమా రంగంలో వందశాతం ఎఫ్ డీఐలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.