Purnea Murder Case: | క్షుద్రపూజల అనుమానంతో.. కుటుంబంలోని ఐదుగురు సజీవదహనం

పూర్నియాలో మంత్రాల నెపంతో దారుణం;

Update: 2025-07-08 00:13 GMT

శాస్త్ర, సాంకేతిక రంగాలలో దూసుకెళ్తుంటే.. సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు, చేతబడులు అనే రుగ్మతలు నిర్మూళించబడడం లేదు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దాడులకు పాల్పడడం, చంపేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా బీహార్ లోని పూర్ణియాలో ఘోరం జరిగింది. మంత్రాల నెపంతో ఒక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన రామ్‌దేవ్ ఒరాన్ కుమారుడు అనారోగ్యానికి గురై మరణించాడు. మరొక కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనంతటికి  చేతబడి  కారణమని గ్రామస్తులు ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

బాబూలాల్ ఒరాన్, సీతా దేవి, మంజిత్ ఒరాన్, రానియా దేవి, టపాటో మోస్మత్ లను గ్రామస్తులు మొదట తీవ్రంగా కొట్టి, ఆపై సజీవ దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ సంఘటన తర్వాత, చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, FSL బృందంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో  నిందితుడు నకుల్ కుమార్‌ను అరెస్టు చేశారు.

ఈ సంఘటన నుంచి బయటపడిన మృతుల కుటుంబాల్లోని లలిత్ కుమార్ మాట్లాడుతూ, తన కుటుంబం మొత్తాన్ని మంత్రగత్తెలు అనే నింద వేసి సజీవ దహనం చేశారని తెలిపాడు. ఈ సంఘటనపై ఎస్పీ స్వీటీ సహ్రావత్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగిందని అన్నారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా గిరిజన ప్రాంతం. భూతవైద్యం, తంత్ర మంత్రాలకు సంబంధించినదని ఎస్పీ అన్నారు. సమీపంలోని చెరువు నుంచి నాలుగు మృతదేహాలను బయటకు తీశామని, అన్నీ కాలిపోయిన స్థితిలో ఉన్నాయని తెలిపారు.

Tags:    

Similar News