ఉత్తర భారత దేశం వరదలతో వణికిపో తోంది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో కూడిన వరదల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పది జిల్లాల్లో భారత వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హిమాచల్ అంతటా వరదల కారణంగా 129 రోడ్లపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇందులో చండీగఢ సిమ్లా హైవే వంటి ప్రధాన మార్గాలు ఉన్నాయి. రైలు సేవలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఆ రోడ్లను మూసి వేశారు. ఈ కారణంగా జనజీ వనం స్తంభించింది. బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లితంగా కర్సోగ్, ధరంపూర్, పండో, తునాగ్ ప్రాంతాల్లో వరదలు సంభ వించాయి. గ్రామాలు, మార్కెట్లలో వరద పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహించి ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నా యి. కర్సోగ్లోని మెగ్లి గ్రామంలో ఒక వాగు దాని ఒడ్డును దాటి నివాస ప్రాంతాల మీదుగా ప్రవహించింది. దీంతో సుమారు ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు రెండు డజన్ల వాహనాలు కొట్టుకుపోయాయి. పండోలో, ఉగ్రమైన నాలా నివాస స్థావరాలను ముంచె త్తడంతో ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపో యారు. ధర్మశాల, కులు, సోలన్లకు కూడా ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. జూలై 7 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, భారీ గాలులు, తీవ్రమైన వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది.