ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది. దీంతో విమాన, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. దిల్లీ ఎయిర్పోర్టులో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో విమానాశ్ర యంలో సేవలకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా దాదాపు 200లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విమాన సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్లైన్లను సంప్రదించాలని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటన జారీ చేశారు. కోల్కతా, చండీగఢ్, అమృత్ సర్, జైపుర్ పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనవరి 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యలో తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది.