Tragedy: అయ్యప్ప భక్తుల బస్సును ఢీకొట్టిన కారు..
నవ దంపతులు సహా నలుగురు మృతి;
కేరళలో పతనంతిట్టలోని మురింజకల్లం వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్సు, కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మలేషియాలో హనీమూన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న నూతన వధూవరుల కారు ఆంధ్రా యాత్రికుల బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారును మహిళ తండ్రి నడిపారు. నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులు కొన్ని మల్లస్సేరి వాసులు. నిఖిల్, అను, ఈపన్ మత్తై మరియు బిజు పి జార్జ్ మరణించారు. అను, నిఖిల్ లకు నవంబర్ 30న వివాహం జరిగింది.
కేరళలోని పథానంతిట్టకు చెందిన అను, నిఖిల్‌కు 15 రోజుల కిందట వివాహమైంది. పెళ్లి తర్వాత హనీమూన్‌కు మలేసియాకు వెళ్లి ఇవాళ తిరిగి కేరళకు వచ్చారు. ఈ క్రమంలో తిరువనంతపురంలో కొత్త దంపతులను రిసీవ్ చేసుకోవడానికి నిఖిల్ తండ్రి మథాయ్ ఈపన్, అను తండ్రి జార్జ్ బిజులు వెళ్లారు. వారంతా కారులో బయల్దేరి సొంతూరికి వెళ్తుండగా ఆదివారం ఉదయం 4.05 గంటల ప్రాంతంలో పనలూరు-మువట్టుపుజ రహదారిపై పథానంతిట్ట జిల్లా మురింజకల్ వద్ద ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నిఖిల్, జార్జ్ బిజు, ఈపన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను మృతి చెందింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా పలువురు అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జవ్వడంతో హైడ్రాలిక్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.