Ghulam Nabi Azad: లోక్ సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న గులాం నబీ ఆజాద్

అనంత్ నాగ్ రాజౌరి స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ఆజాద్

Update: 2024-04-18 01:15 GMT

జమ్ముకశ్మీర్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ యూ టర్న్‌‌ తీసుకున్నారు.   లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ కోసం ఆయనను ఆ పార్టీ నామినేట్‌ చేసింది. అయితే గులాం నబీ ఆజాద్ అనూహ్యంగా యూటర్న్‌ తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బుధవారం ప్రకటించారు. అనంతనాగ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

కాగా, అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గులాం నబీ ఆజాద్ పోటీ చేస్తారని ఈ నెల 2న డీపీఏపీ ప్రకటించింది. దీంతో ఈ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్‌తో ఆయన తలపడతారని అంతా భావించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని గులాం నబీ ఆజాద్‌ బుధవారం స్పష్టం చేశారు.

Tags:    

Similar News