TATA నుంచి మా వాటా ఇప్పించండి :షాపూర్జీ ప్లల్లోంజి
టాటా గ్రూప్‌తో పూర్తి తెగతెంపులకు సిద్దమైన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ మరోసారి కోర్టులో తన వైఖరి స్పష్టంగా చెప్పింది. టాటాలతో కలిసి ఉండలేమని..;
టాటా గ్రూప్‌తో పూర్తి తెగతెంపులకు సిద్దమైన షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ మరోసారి కోర్టులో తన వైఖరి స్పష్టంగా చెప్పింది. టాటాలతో కలిసి ఉండలేమని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ వాటా తమకు విడగొట్టాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా సన్స్ ఈక్విటీలో తమకు ఉన్న 18.37 శాతం వాటా ప్రస్తుత విలువ రూ.1.75 లక్షల కోట్లు ఉంటుందని తెలిపింది కంపెనీ. టాటా గ్రూప్‌లోని అన్ని కంపెనీల్లో తమకు వాటా ఉందని తెలిపింది. టాటా గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల్లో దామాషా పద్దతి తమ వాటా విలువ లెక్కించాలని కోరింది. ఇందుకు ఆయా కంపెనీల షేర్ల విలువతో పాటు,ఆయా కంపెనీల బ్రాండ్‌ల విలువనూ పరిగణనలోకి తీసుకోవాలంటోంది.
టీసీఎస్ ఈక్విటీలో టాటా గ్రూప్‌నకు ఉన్న 72 శాతం వాటా ఉంది. ఇందులో 13.22 శాతం ఎస్‌పీ గ్రూప్‌నకు వస్తుంది. ప్రస్తుతం టీసీఎస్ షేరు మార్కెట్ ధర ప్రకారంSP గ్రూపునకు రూ.1.35 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో నమోదు కాని కంపెనీల వాల్యూ లెక్క గట్టాల్సి ఉంది. మొత్తానికి సైరస్ మిస్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఇరు కుటుంబాల మధ్య విబేధాలు మరింత ముదిరాయి. చివరకు సుప్రీంకోర్టు వరకూ పంచాయితీలు నడుస్తున్నాయి.