హిమాచల్ ప్రదేశ్ లోని మాండ్యా ఎంపీగా కొనసాగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు రాజకీయ రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నారా.. ప్రధాని కావాలన్న లక్ష్యం ఏమైనా ఉందా..?అనే ప్రశ్నకు కంగనా సమాధానమిచ్చారు. “నేను భారత ప్రధాని పదవికి సమర్థురాలినని అనుకోవడం లేదు. ఆ కోరిక కూడా నాకు లేదు. దేవుడు నన్ను ప్రధానిని చేయడు. సామాజిక సేవ నా నేపథ్యం కాదు. పూర్తిగా ప్రజా సేవకు అంకితమయ్యే మనస్తత్వం నాది కాదు.' అంటూ చెప్పుకొచ్చింది. తాను రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఆస్వా దించలేకపోతున్నానన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువస్తో న్న సమస్యలపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఒకప్పుడు తాను నాస్తికురాలినని తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం వైపు వచ్చాన ని అన్నారు. రాజకీయ రంగం చాలా భిన్నమైనదని, తాను మహిళల హక్కుల కోసం పోరాడానని అన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్న సమస్యలు చూసి ఆశ్చర్యం కలుగుతోందని చెప్పారు. 'నేను ఎంపీని.. కానీ, ప్రజలు నా వద్దకు పంచాయతీస్థాయి సమస్యలు తీసుకువస్తున్నా రు. రోడ్లు బాగాలేవని చెబుతుంటారు. అది రాష్ట్ర ప్రభుత్వం స్థాయిదని నేను చెప్పినప్పటికీ వారు అర్థం చేసుకోరు. 'మీ సొంత డబ్బును ఉపయోగించి సమస్యను పరిష్కరించండి' అని అంటారు' ఇదేంటో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు కంగన.