Powerlifter Lost Life : 270 కిలోల రాడ్ మెడపై పడి.. పవర్ లిఫ్టర్ మృతి
రాజస్తాన్ లో దారుణం;
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన యష్తిక ఆచార్య మంగళవారం జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా 270 కేజీల బరువైన రాడ్ ఆమె మెడపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే దవాఖానకు తరలించారు. కానీ ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని వారికి బుధవారం అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ట్రైనర్ కూడా స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు.
270 కిలోల రాడ్ మెడపై పడటంతో.. ఆమె మెడ విరిగిపోయింది. యస్తికను ట్రైన్ చేస్తున్న కోచ్ కి కూడా స్వల్పంగా గాయలయ్యాయి. పవర్ లిఫ్టింగ్ లో యస్తిక రాణిస్తోంది. యస్తిక ఆచార్య జూనియర్ నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యస్తిక.. ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని కుటుంబసభ్యులు, కోచ్, సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యస్తిక దుర్మరణం క్రీడా ప్రపంచానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఈ దుర్ఘటన క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాక్టీస్ సమయంలో మరింత భద్రతా ఏర్పాట్లు అవసరం అని చెప్పడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. ప్రాక్టీస్ లో భాగంగా 270 కిలోల బరువున్న రాడ్ ను యస్తిక పైకి లేపింది. వెనుకే ఉన్న కోచ్ ఆమెకు సాయం చేస్తున్నారు. అయితే, బరువు ఎక్కువగా ఉన్న క్రమంలో ఆమె దాన్ని అదుపు చేసుకోలేకపోయింది. అదే సమయంలో ఆమె కాలు స్లిప్ అయ్యింది. అంతే, ఆ రాడ్ జారి ఆమె మెడపై పడింది. వెనుకే ఉన్న కోచ్ కూడా ఏమీ చేయలేకపోయాడు. రాడ్ మెడపై నుంచి కిందకు జారి పడింది.
అదే సమయంలో వెనుకే ఉన్న కోచ్ ముఖానికి ఆమె తల బలంగా తాకింది. అంతే.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. అంత బరువున్న రాడ్ మీద పడటంతో ఆమె మెడ విరిగింది. ఆమె తల బలంగా తాకడంతో కోచ్ కి కూడా గాయాలయ్యాయి. రాడ్ మెడపై పడటంతో యస్తిక స్పాట్ లోనే కుప్పకూలిపోయింది. చలనం లేకుండా నేలపై పడిపోయింది. ఇదంతా కళ్లారా చూసిన సిబ్బంది షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఒక ప్రాణం పోయింది.