యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు జపాన్ కంపెనీ సోనీ షేర్లు ఏకంగా 10% పతనమయ్యాయి. ఇప్పటికే ట్రంప్ టారిఫ్స్‌ను చాలా దేశాలు వ్యతిరేకించాయి. సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో పలు దేశాలు చర్చలకు దిగాయి.
టారిఫ్స్ నిర్ణయం యూఎస్ భవిష్యత్తుకు ఎంతో కీలకమన్న విషయం ఏదో ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇలా స్పందించారు. ‘చైనా, ఈయూ సహా ఎన్నో దేశాలతో మనకు ఆర్థిక లోటు ఉంది. టారిఫ్స్ విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఈ నిర్ణయంతో $బిలియన్ల ఆదాయం వస్తుంది. జో బైడెన్ మిగిల్చిన లోటును అతిత్వరలో పూడ్చుతాం’ అని పేర్కొన్నారు.
అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.