కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి. విమానాలకు సంబంధించిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర కూడా 1.54 శాతం తగ్గింది. ఫలితంగా ధర కిలో లీటర్‌కి రూ.1,401.37 తగ్గింది. అందువల్ల కొత్త ధర ఢిల్లీలో కిలోలీటర్‌కి రూ.90,455.47కి చేరింది. ఇండియాలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అత్యంత బిజీగా ఉంటుంది. అక్కడ ATF ధర తగ్గడం అనేది పాజిటివ్ అంశం అనుకోవచ్చు.