Good News for Farmers : రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్

Update: 2024-12-14 16:45 GMT

రైతు రుణాలపై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే లోన్ లిమిట్ 1.6 లక్షల నుంచి రూ.2 లక్షల కు పెంచగా.. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. రైతులు ఎదుర్కొంటు న్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది. తద్వారా చిన్న, సన్నకారు రైతులైన 86 శాతం మందికి ప్రయోజనం చేకూరనుందని వెల్లడిం చింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. సాధారణంగా భూ యజమానుల నుంచి ఎలాంటి పూచీ కత్తు అడగకుండా బ్యాంకులు లోన్స్ ఇవ్వాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలుకావడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో రుణం తీసుకొని అప్పులపాలవుతున్నా రు. అలాంటివారికి అండగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ సదుపాయం కల్పిస్తోంది.

Tags:    

Similar News