అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం-కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద 20వ విడత నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద ఈ నిధులు విడుదల చేశారు. రూ.20వేల కోట్ల నిధులతో 9.7 కోట్ల మంది రైతులకు లాభం చేకూరనుంది.
రైతులకు ఏటా ఒక్కోవిడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందించే ‘పీఎం కిసాన్’ పథకాన్ని కేంద్రం 2019 లోప్రారంభించింది. ఇప్పటివరకు రైతులకు 19 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది. నిధులు రాని రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in లేదాహెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011-24300606 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.