తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇకపై మరికొన్ని స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ పై సానుకూలంగా స్పందించిన రైల్వే.. మొత్తం 18 రైళ్లకు కొత్త హాల్ట్ లు ప్రకటించింది.
రైళ్ల వివరాలు - కొత్త స్టాపేజీలు
రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి రైల్వే స్టేషన్.
హౌరా - పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి స్టేషన్.
హుబ్లీ - మైసూర్ - హంపి ఎక్స్ ప్రెస్ - అనంతపురం స్టేషన్.
సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ ప్రెస్ - సిరిపురం.
కాజీపేట -బలార్ష ఎక్స్ ప్రెస్ - రాఘవపురం.
కాజీపేట - బలార్ష ఎక్స్ ప్రెస్ - మందమర్రి స్టేషన్.
పూణె - కాజీపేట ఎక్స్ ప్రెస్ - మంచిర్యాల.
దౌండ్ - నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ - నవీపేట్.
తిరుపతి - ఆదిలాబాద్ - కృష్ణా ఎక్స్ ప్రెస్ - మేడ్చల్ స్టేషన్.
భద్రాచలం - సింగరేణి ఎక్స్ ప్రెస్ - బేతంపూడి స్టేషన్.
నర్సాపూర్ - నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ - మహబూబాబాద్ స్టేషన్.
సికింద్రాబాద్ - తిరుపతి - వందేభారత్ ఎక్స్ ప్రెస్ - మిర్యాలగూడ స్టేషన్.
సికింద్రాబాద్ - భద్రాచలం - కాకతీయ ఎక్స్ ప్రెస్ - తడకలపుడి.
రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - రామన్నపేట.
గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - ఉంద నగర్.
కాజీపేట్ - బలార్ష ఎక్స్ ప్రెస్ - Rechni Road, తాండూరు.
తిరుపతి - సికింద్రాబాద్ - పద్మావతి ఎక్స్ ప్రెస్ - నెక్కొండ స్టేషన్.
భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ - బేతంపుడి.
తెలంగాణలో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించేందుకు పది రైళ్లకు సంబంధించిన కొత్త స్టాప్‌లకు రైల్వేశాఖ ఆమోదం తెలపడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను చేసిన విజ్ఞప్తికి స్పందించి కొత్త స్టాప్ లకు ఆమోదం తెలిపినందకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.