కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
వచ్చే ఏడాది కానుకగా 8వ వేతన సంఘం అమలులోకి రానుంది. ఎనిమిదో వేతన కమిషన్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఏడవ వేతన సంఘం కింద వేతనాలు పొందేవారు. దీంతో పాటు శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష యాత్రకు ఊపునిచ్చేలా కొత్త లాంచ్ ప్యాడ్‌కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
బడ్జెట్లో రైల్వేస్‌కు 20% ఎక్కువ నిధులు కేటాయిస్తారని సమాచారం. ఆర్థిక సంవత్సరం 25లో కేటాయించిన రూ.2.65లక్షల కోట్ల నుంచి రూ.3లక్షల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. ప్రస్తుత CAPEXలో ఇప్పటికే 80-90% మేర ఖర్చుపెట్టేశారు. ఆర్థిక సంవత్సరం26లో మరిన్ని రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే ట్రాకుల డీకంజెషన్ వంటి పనులు చేపట్టనున్నారు. అందుకే నిధులు పెంచుతారని విశ్లేషకులు అంటున్నారు.