ఏడు పదుల వయసులోనూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. 51 పుష్ అప్స్ చేసి ఔరా అనిపించారు. గవర్నర్ ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మదురైలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి హాజరయ్యారు. 70 ఏండ్ల వయసులో ఆగకుండా 51 పుష్ అప్స్ చేసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. గవర్నర్ ఫిట్‌నెస్ చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.