Governor Quota MLCs : గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్, కోదండరాం

Update: 2025-08-30 12:45 GMT

గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రో. కోదండరాం, అజహరుద్దీన్ క్యాబినెట్ ఫైనల్ చేసింది. ఈరోజు జరిగిన సమావేశంలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపారు. గతంలో ప్రో. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా… ఇటీవలే వారిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజహరుద్దీన్ కు అవకాశం కల్పించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ ద్వారా విషయాన్ని తెలియజేసింది. కాసేపట్లోనే ఈ విషయం పైన అధికారిక ప్రకటన వెలువలనుంది.

Tags:    

Similar News