GPS-Based Toll Collection : మే 1 నుంచి జీపీఎస్ ఆధారిత ఫాస్టాగ్ టోల్ వసూలు

Update: 2025-04-18 09:15 GMT

దేశంలో హైవేలపై టోల్ ఫీజుల వసూళ్లలో సమూల మార్పులను ప్రభుత్వం తీసుకు రానుంది. మే 1వ తేదీని నుంచి ప్రస్తుతం టోల్ వసూళ్లకు వినియోగిస్తున్న ఫాస్టాగ్ ను పూర్తిని నిలిపివేయనుంది. దీనిస్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్ల యంత్రాంగం అమల్లోకి వస్తుంది. సామర్థ్యాన్ని పెంచడం, రద్దీని తగ్గిం చడం కోసం ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం వచ్చిన తరు వాత అంతకు ముందున్న మాన్యువల్గా వసూళ్లతో పోల్చుకుంటే వేచివుండే సమయం గణనీయంగా తగ్గింది.

ఫాస్టాగ్ ను ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టింది. ఇందుకు ఆర్ఎఫ్ఎస్ఐడీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి నుంచి ఎలక్ట్రానిక్ విధానంలో టోల్ ఫీజ్లను వసూలు చేస్తున్నారు. జాతీయ రహదారులపై ఏటా పెరుగుతున్న

జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లు వాహనాల రద్దీ, సిస్టమ్ సమస్యలు, టోల్ బూత్ల వద్ద లైన్ లో అప్పటికే వాహనాలు ఉండటం, ఫాస్టాగ్ ను దుర్వినియోగం చేయడం వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీని కంటే మెరుగైన విదానం కోసం చాలా కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే జీపీ ఎస్ ఆధారిత టోల్ వసూళ్ల విధానం అమల్లోకి తీసుకు వచ్చారు. 

Tags:    

Similar News