Ghulam Nabi Azad : కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న గులాం నబీ ఆజాద్..
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ రాజకీయ నేత గులాంనబీ ఆజాద్ కొత్తపార్టీ ఏర్పాటులో నిమగ్నమయ్యారు.
Gulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ రాజకీయ నేత గులాంనబీ ఆజాద్ కొత్తపార్టీ ఏర్పాటులో నిమగ్నమయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుపై ముమ్మర కసరత్తు చేస్తున్న ఆయన.. తన సొంతరాష్ట్రం జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు. జమ్ముకశ్మీర్‌లో గులాంనబీ ఆజాద్ మెగా ర్యాలీ నిర్వహించగా.. నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ పార్టీపై గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు తెగిపోయాయని ఆరోపించారు.
తాను కాంగ్రెస్‌కు రక్తం ధారపోస్తే.. ఆపార్టీ తాను చేసిన సేవలను మర్చిపోయిందని మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి ఇంకా పేరు పెట్టలేదన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలే తమ పార్టీకి పేరు, జెండాను నిర్ణయిస్తారని చెప్పారు. అందరూ అర్థం చేసుకునేలా తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ఒక హిందుస్తానీ పేరు పెడతామని గులాంనబీ ఆజాద్ స్పష్టంచేశారు.