Gunfire in Chattisgarh : చత్తీస్ గఢ్ అడవుల్లో తుపాకుల మోత..10 మంది మావోయిస్టులు మృతి?
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో తుపాకుల మోత కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఎదురు ఎదురు కాల్పులు జరిగడంతో హై అలర్ట్ ప్రకటించారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకుంటూ ఇరువర్గాలు భీకరంగా పోరాడుతున్నాయి.