చెన్నైలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
చెన్నై మరోమారు జలమయమైంది. చెన్నైతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షం కురుస్తోంది.;
చెన్నై మరోమారు జలమయమైంది. చెన్నైతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిండి, వేళచ్చేరి, వడపళని మొదలైన ప్రాంతాల్లో రోడ్లపై వాననీరు నిలిచింది. గడచిన 24 గంటల్లో నగరంలో అత్యధికంగా 16, అత్యల్పంగా 7 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, రాణిపేట, వేలూర్ తో పాటు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మీనంబాక్కంలో గత 73 ఏళ్లలో నమోదైన రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని అధికాలు తెలిపారు.