ఉత్తరాఖండ్లో విమాన ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసు పత్రికి తరలించారు. ఉత్తర కాశీ జిల్లాలో ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో కొందరు పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంలో కుప్పకూలిపోయింది. కాగా, ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుం బాలకు సంతాపం తెలిపారు. "ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు దేవుడు శాంతిని ప్రసాదించాలని మరియు ఈ అపారమైన నష్టా న్ని భరించే శక్తిని మృతుల కుటుంబాలకు ప్ర సాదించాలని కోరుకుంటున్నాను" అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.