India-Bangladesh Border : భారత్-బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్

Update: 2025-05-01 10:30 GMT

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత బంగ్లా దేశ్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో బంగ్లాదేశ్, పాక్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాక్ ఐఎస్ఐ, పాకిస్తాన్ మిలిటరీ భారత్ బంగ్లా సరిహద్దుకు చేరుకుంటున్నాయి. బంగ్లాదేశ్ లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాక్ ఐఎస్ఐ, పాక్ మిలిటరీ అధికారులు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ పెద్ద మొత్తంలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశతో పాటు అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు బలోపేతం చేసే ప్రయత్నాలను పాక్ ముమ్మరం చేసింది. యుద్ధం అనివార్యం అయితే ఇండియాను ఇబ్బంది పెట్టేలా సరిహద్దు ప్రాంతంలోని ఆ గ్రూపులను వాడుకోవాలని ఆలోచన చేస్తుంది.

Tags:    

Similar News