PM Modi : ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం

Update: 2025-05-12 13:00 GMT

ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో ఆయన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ప్రా రంభమైంది. రక్షణమంత్రి రాజ్నాథ్సంగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు సమా వేశానికి హాజరయ్యారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రా చీఫ్ కుడా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విమరణకు రెండు రోజుల క్రితమే ఒప్పందం కుదిరింది. మరోవైపు ఉద్రి క్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్స్ ఇవాళ సమావేశం కా నున్నారు. గతవారం పౌర విమాన సర్వీసులను మూసివేసిన 32 విమానాశ్రయాలను తిరిగి తెరిచేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన ప్రస్తుతం జరు గుతున్న ఉన్నత స్థాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News